27, ఫిబ్రవరి 2023, సోమవారం

 శ్రీ వేంకటేశ్వరుని ప్రార్థిస్తూ ఒక సీసపద్యం: 


వేంకటాచలమున వెలుగుచు నిలుచుండి / పృథ్వి జనులనెల్ల పెంచుచుండి 

మొక్కులు గోరుచు ముదముతో వారికి / శుభము లీడేర్చుచు శోభ లొసగి 

కాని పనుల జేసి కర్కశత్వమె గూడి / కల్లోల మొందించు ఖలుల నంత 

నేదియో వైనము నిఱుకున బెట్టుచు / పాపహరణమును పన్ను చుండి 


పదిలముగ పది యవతార పటిమ లన్ని / కూడి వెలసిన పరమాత్మ కొలుతు నిన్ను 

విశ్వ రక్షణ దక్షాయ! విమల చరిత / వేంకటేశాయ తే! నమో వేదవేద్య! 

                                                                         రచన: క్రొవ్విడి వెంకట రాజారావు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...