28, ఫిబ్రవరి 2023, మంగళవారం

 భక్తి అంటే...........


    ఒక వ్యాపారి తన వ్యాపారంలో లాభాలు వస్తే లాభంలో ఒక శాతం భగవంతుని హుండీలో సమర్పించుకుంటానని తన మనస్సులో అనుకుంటాడు. ఆ సంవత్సరం ఒక లక్ష రూపాయలు లాభం రాగా గుడికెళ్ళి ఒక శాతం అంటే వేయి రూపాయలు చేతిలో పట్టుకొని గుడి ముఖద్వారం నుండి గర్భాలయం వరకు ఎన్నో హుండీలున్నా భగవంతుడి ముందర ఉన్న హుండీలోనే డబ్బు వేయడానికి హుండీలో చేయి చాచి, ఆ హుండీకి భగవంతుని విగ్రహానికి మధ్యన పూజారి కానీ, భక్తులు కానీ అడ్డులేకుండా ఉన్నప్పుడు హుండీలో డబ్బు వదులుతాడు. ఎందుకంటే భగవంతునికి తాను హుండీలో వేసేది కనపడాలి కదా. ఈ సారి పది లక్షలు లాభం వస్తే పది శాతం అంటే లక్ష భగవంతుని హుండీలో సమర్పించుకుంటానని అనుకుంటాడు. అయితే, ఆ సంవత్సరం తొమ్మిది లక్షలు లాభం వస్తే ఆ భక్తుడంటాడు " దేవుడు చాలా యుక్తిపరుడు తన లక్ష తాను మినహాయించుకొని మిగతా తొమ్మిది లక్షల లాభం నాకిచ్చాడు. నాచేతికి వస్తే ఎక్కువ మొత్తం కదా ఇవ్వనేమో అని అనుకొని ఉంటాడు " అని తన స్వార్థాన్ని చాటుకున్నాడు. 

                                                                                                             సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...