కాలయానం:
సాధారణంగా సూర్యోదయం తూర్పున, సూర్యాస్తమయం పడమరన జరుగుతుందని అందరూ అనుకొంటారు.
ఉత్తరాయణం - సూర్యగమనం
మకర సంక్రమణం - జనవరి నుండి జూలై వరకు
జనవరి నుండి జూలై మధ్య కాలంలో భూపరిభ్రమణం వలన సూర్యగమనం తూర్పు నుండి ఆగ్నేయం వరకు మారి తిరిగి ఆగ్నేయం నుండి తూర్పుకు వచ్చును. ఫలితంగా సూర్యోదయ దిశలు మారుచుండును. ఈ కాలంలో సూర్యోదయం, మొదటి మూడు మాసములు తూర్పునుండి దినదినం అగ్నేయం వైపు మారుతూ మూడవ మాసాంతమున, ఆగ్నేయాన్ని చేరుకుని, తిరిగి అగ్నేయము నుండి క్రమక్రమంగా తూర్పుకు మారును.
దక్షిణాయనం - సూర్యగమనం
కర్కాటక సంక్రమణం - జూలై నుండి జనవరి వరకు
జూలై నుండి జనవరి మధ్య కాలంలో భూపరిభ్రమణం వలన సూర్యగమనము తూర్పు నుండి ఈశాన్యదిశగా మారి తిరిగి ఈశాన్యం నుండి తూర్పుకు వచ్చును. ఫలితంగా సూర్యోదయ దిశలు మారుచుండును. ఈ కాలంలో, సూర్యోదయం మొదటి మూడు మాసములు తూర్పునుండి దినదినం ఈశాన్యం వైపు మారుతూ మూడవ మాసాంతమున ఈశాన్యాన్ని చేరుకుని, తిరిగి ఈశాన్యం నుండి క్రమక్రమంగా తూర్పుకు మారును.
సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి