జీవనస్రవంతి:
" దంతసిరితోనే గుండె పదిలం "
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాల్లో మూడింట ఒక వంతు హృద్రోగాల వల్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే హృద్రోగ కారణాలను అనేక కోణాల్లో పరిశీలించినప్పుడు - వాటికీ నోటిలోని బాక్టీరియాకీ సంబంధం ఉందని చెబుతున్నారు స్విట్జర్లాండుకు చెందిన నిపుణులు. ఇందుకోసం వీళ్ళు రక్త ప్రసరణకు అడ్డుపడుతున్న క్లాట్సును సేకరించి పరిశీలించారట. జన్యువులు, కాలుష్యం, ధూమపానం, బిపి, మధుమేహం, కొవ్వులు... ఇలా యెన్నో గుండె జబ్బులకు కారణ మవుతున్నాయి. వీటితోబాటు కొన్ని రకాల బాక్టీరియా, వైరస్ ల వల్ల తలెత్తే ఇన్ ఫ్లమేషన్ కూడా హృద్రోగాలకు దారితీస్తున్నట్లు గుర్తించారు. దాంతో గుండె సమస్యలున్న నాలుగువేల మందిని పన్నెండేళ్ళపాటు పరిశీలించినప్పుడు - అందులో చిగుళ్ళ వ్యాధుల్ని కలిగించే 'ప్యుసాబాక్టీరియం న్యూక్లియాటం ' అనే బాక్టీరియా వల్ల గుండె జబ్బుల ప్రమాదం మరింత ఎక్కువవుతున్నట్లు తేలిందిట. ఇది ముందుగా దంతాల్లో ఇన్ ఫెక్షన్ కు కారణమై అక్కడినుంచి నేరుగా గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడానికి కారణమవుతున్నట్లు గుర్తించారు. కాబట్టి దంత సమస్యలున్న వాళ్ళకి హృద్రోగం వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి