::
సూక్తిముక్తావళి ::
1. శ్లో. ఋణం
యాచ్నా చ వృద్ధత్వం, జార చోర దరిద్రతా,
రోగశ్చ భుక్తశేషశ్చా, ప్యష్టకష్టా: ప్రకీర్తితా:
( పంచతంత్రం )
భావము: ఋణములలో
మునిగియుండుట, యాచన, ముసలితనము, వ్యభిచారము, దొంగతనము, దారిద్ర్యము, రోగము,
ఎంగిలితిని బ్రతుకుట – యీ ఎనిమిదిన్నీ అష్టకష్టములుగా చెపుతారు. (వీటికంటే మానవుని
నీచపరచేవి లేవని తాత్పర్యము.)
పద్యము:
భారవి ( భర భర భర
లగ – 13 )
అప్పులలో సదా మున్గి చరించుటన్, యాచనసల్పు తత్త్వమున్,
ముప్పునొసంగు
చోరత్వ చరిత్రమున్, పోడిమికాని
జ్యానియున్,
రొప్పునొనర్చు జారత్వము, లేమిడిన్, రోగము, భుక్తశేషమున్,
చెప్పుదు రష్టకష్టమ్ములుగా బుధుల్ క్షేమము
యోగమెంచుచున్.
2. శ్లో.
దాతృత్వం ప్రియవక్తృత్వం, ధీరత్వ
ముచితజ్ఞతా,
అభ్యాసేన న లభ్యంతే, చత్వార స్సహజా గుణా:.
భావము: దానగుణము, మంచిమాటలాడు స్వభావము, ధీరత్వము, ఉచితానుచిత
జ్ఞానము – ఈ నాలుగున్నూ పుట్టుకతో వచ్చేవే గాని నేర్చుకుంటే వచ్చేవి గావు.
పద్యము:
దానమొసగెడి యాలుడి, క్రమము దప్పక హితము గోరుచున్
జానుగ
పలుకు తత్త్వము, ధృతిని సాగెడి వితపు నడ్తియున్,
జ్ఞాన
మలరగ నిచ్చలు పటిమ చాటెడు తెలివితేటలున్,
పూనును
జనువు నుంచియు, కలుగ బోవవి కఱచ దల్చగన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి