:: సూక్తిముక్తావళి ::
శ్లో. ఆరోప్యతే
శిలా శైలే, యత్నేన మహతా యథా,
నిపాత్యతే క్షణేనాధ:, తథాత్మా గుణదోషయో:.
భావము: పర్వతముమీది కొక
గండశిలను యెక్కించుట కెంతయో ప్రయత్న మవసరము. దానినే అచ్చటినుంచి క్రిందికి
త్రోసివేయుట ఎంతో సుకరము. అట్లే మానవునియందు గుణములను జొప్పించుట బహుళ
కష్టతరమున్ను, చెడును అలవరచుట మిక్కిలి సుకరమున్ను అయి
వుంటూంది.
పద్యము:
అరసాత ( భభ భభ భభ
భర – 13 )
రాయిని కొండకు జేర్చుట కెంతయు లాతగు యత్నము
కావలె, నట్టిదే
రాయిని శైలము నుండియు త్రోసి మరల్చుట తేలికయేనగు, నట్టులే
శ్రేయము గూర్చు గుణమ్ముల నన్నియు జేర్చుట
కష్టమునై, చెడు నెంచుచున్
శ్రేయముగాని నికారము లెల్లను జేర్చుట
మానవులందున తేలికౌ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి