17, జనవరి 2024, బుధవారం

 సమస్యాపూరణ: 

 

" దగ్గు వారలకే శాంతి దక్కుచుండు " 


తే.గీ.  రాజధర్మములెల్లను ప్రౌఢి కలిగి 

           పల్కువడి బుద్ధిహీనుడై వాదులాడు 

           సామితో తగవాడక సహనమెంచి 

           దగ్గు వారలకే శాంతి దక్కుచుండు. 


" దగ్గెడి వారికే సుఖము దక్కునుగాదె ధరాతలమ్మునన్ "


ఉ.      చక్కని రాజధర్మములు శస్తమునౌవిధి తెల్పువేళలో 

           పెక్కుగ మూర్ఖవాదనలు వెంబరియై యొనరించు రాజుతో 

            చిక్కులు సంభవించునను చింతనజేసి క్షమన్ ఘటించుచున్ 

            దగ్గెడి వారికే సుఖము దక్కునుగాదె ధరాతలమ్మునన్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...