అష్టవిధనాయికలు:
(6). కలహాంతరిత
ఉ. కోపకషాయితాక్షి యగు కోమలి మూర్ఖత ప్రాణనాథునిన్
ప్రోపరియైన వాని తన పొత్తును కోరెడువాని ధూర్తయై
దాపట నిల్పగా పరులు తామసమున్ నిరసించు బిట్టు సం
తాపము చెందు నాతియె కదా కలహాంతరితాఖ్యయౌ దగున్.
(7). ప్రోషితభర్తృక
ఉ. కాంతుడు దూరదేశమున కార్యభరంబున గల్గు నొత్తిడిన్
సుంతయు పత్నిపై మనసు జూపక నింటికిరాని హేతువై
యింతికి నెంతయున్ దిగులె యేర్పడి యాతనికై తపించుచున్
పొంతయు గోరు భామినిని ప్రోషితభర్తృక యండ్రు ధారుణిన్.
(8). అభిసారిక
ఉ. ప్రేమకు లొంగి చంద్రముఖి ప్రేయము శ్రేయము నుజ్జగించుచున్
నేమము లేని శీలమున నెమ్మది ప్రేమికుడెన్ను తావుకున్
కామినియై రహస్యముగ గమ్యము జేరునె వారి నెంచకే
ధామము వీడిపోవు వనితన్ అభిసారిక యందు రెల్లరున్.
రచన: క్రొవ్విడి వేంకట రాజారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి