20, సెప్టెంబర్ 2023, బుధవారం

 :: రామసుగ్రీవులమైత్రి :: 

( వివిధ ఛందస్సులలో ) 

( నిన్నటి అయిదు పద్యముల తరువాయి - ఈరోజు అయిదుపద్యాలు)

వాతోర్మి

ఓరామా! ధర్మమె యుక్తమ్ముగ నీ 

వారాధించంగల వాడంచును తా 

తీరొందన్ మారుతి తెల్పన్ మది నిన్ 

బారాదిన్ మెచ్చితి పారమ్యముగా! 

హరిహర 

వానరుడనౌచు పరగు నాతోడ 

పూనికనుగూడి మురిపె మొందంగ 

మానగు సమామగమమును వాంఛించి 

యానికను గోర నరుసమున్ గల్గె. 

ప్రహర్షిణి 

రామా! నీ చెలిమియె రంజనమ్ము నాకున్ 

క్షేమమ్మున్ కడు కలిగించు సౌఖ్యమీయున్

ప్రేమన్ జూపుచు నిట ప్రీతితో కరమ్ముల్ 

ప్రామాణ్యంబగునటు పట్టుచుందుమిచ్చో. 

మందర 

భానుజు డీవిధి పలుకగ విని తా 

జానుగ రాముడు సరదుచు కరమున్ 

పైనను వేయుచు పరిచయమును నే 

మానము తోడను మలిచెద ననియెన్. 

పృథ్వి 

అనంతరము నాంజనేయుడట నగ్నినిన్ వేల్చగా 

దినేశ్వర తనూజుతో  రఘుపతిన్ విధంబొందుచున్ 

మనమ్మున సఖిత్వ భావమును మంచిగా దల్చుచున్

స్వనిన్నభినుతించి మిత్రులయి వారు పొంగారిరే! 


2 కామెంట్‌లు:

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...