22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

  :: రామసుగ్రీవులమైత్రి :: 

( వివిధ ఛందస్సులలో ) 

( నిన్నటి అయిదు పద్యముల తరువాయి - ఈరోజు అయిదుపద్యాలు)

మేఘవిస్ఫూర్జతము: 

వివేకమ్మున్ బోబుచ్చి మెదలుచు తా వీకుతో వాలినాకున్

అవస్థల్ సృష్టిన్ జేసి తరిమెను గేహమ్ము వీడన్ మరింకన్ 

పవిత్రంబౌ రీతిన్ మురిపెమిడు నా భార్యనే యాహరించెన్ 

అవష్టంబంబే పోవ నడుగిడితిన్నంజికన్ కాననుండిన్. 

శార్దూలలలితము: 

శ్రీరామా! భయమున పల్లటిలెడి స్నిగ్ధుండనగుట 

చే రీతిన్నభయమొసంగి కుతిని చిట్లించుము వడి 

గా రూపున్ గలిగిన ధైర్యమెసగి కాశున్ చొనుపుము 

శూరుండై వెలిగెడి నీకు నదియ సుంతౌను కనుక. 

భద్రకము: 

తేజముతోడ తేజరిలుచుండి తీరగు గుణమ్ములన్ దొరలుచున్ 

భాజనములైన ధర్మములనెల్ల పాటవముతోడ పాటి గొనుచున్ 

ఈజగతిన్ ప్రశస్తమగునట్టు లెచ్చు ఘనతన్ ప్రవర్థిలుచు తా 

పూజలనొందు రాముడనె సూరి పుత్రు గనుచున్ ప్రియమ్మగు మదిన్. 

మేదిని (వాణి): 

చెలుడవు నీవు నీకొఱకు చెన్నుగూర్చునట్లున్ 

వలసిన సాయమున్ సలిపి బాంధవమ్మునందున్ 

విలువను దెచ్చెదన్ వినుము వీకతోడ నీవున్ 

పిలువుము వాలిన్ విడిగ బిట్టు తేర్చుచుందున్. 

మేదురదన్తమ్ (కిరీట): 

చెప్పెను రాముడె యార్కికి వాడిమి చెందిన నా విజినమ్ముల వేయుచు 

నిప్పుడె వాలిని నంతము జేసియు నింపును గూర్చెడి నీ సతితోడను 

మెప్పగురీతినిరాజ్యము గూర్చుచు మెల్పుగ రాజుగ జేయుదు చక్కగ 

తిప్పల నార్పెద పొంగును గూర్చెద తీరుగ నుండు మటంచును లేచెను. 

(సమాప్తం. రేపు మరొకటి.....) 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...