:: చిత్రకేతుడి కథ ::
ఒక శాపం .... ఒక జీవితాన్ని రాక్షసుడిగా మార్చేసింది! కానీ, ఆ రాక్షసుడు మరణించేటప్పుడు కూడా చిరునవ్వుతో ఎందుకున్నాడు?
సాక్షాత్తు కైలాసనాథుడినే విమర్శించేంత ధైర్యం అతనికి ఎక్కడిది? జగన్మాత పార్వతీదేవి ఆగ్రహానికి గురైన ఆ " చిత్రకేతుడి " విచిత్ర గాథ మీకు తెలుసా?
చిత్రకేతుడు అనే రాజు భగవంతుని అనుగ్రహంతో విద్యాధరుడు అవుతాడు. ఒకసారి విమానంలో వెడుతూండగా, కైలాసంలో శివుడు పార్వతీదేవిని ఒడిలో కూర్చొనబెట్టుకొని మునులమధ్య ప్రసంగించడం చూసి నవ్వుతాడు. " లోకనాథుడివై ఉండి ఇలా చేస్తున్నావేమిటి? " అని పరిహాసం చేస్తాడు. శివుడు నవ్వుతూ ఊరుకున్నా, పార్వతీదేవి ఆగ్రహించి అతనిని " వృత్తాసరుడు " అనే రాక్షసుడిగా పుట్టమని శపిస్తుంది.
చిత్రకేతుడు ఏమాత్రం భయపడకుండా, ఆ శాపాన్ని శిరసావహించి ఆమెకు నమస్కరిస్తాడు. " అమ్మా! సుఖదు:ఖాలు, శాపాలు అన్నీ భగవంతుని ప్రసాదాలే " అని ప్రశాంతగా వెళ్ళిపోతాడు. అదిచూసి శివుడు పార్వతితో, " చూశావా దేవీ! నారాయణ భక్తులకు స్వర్గం, నరకం, శాపం అన్నీ ఒకటే. వారి నిశ్చల భక్తి అటువంటిది " అని వివరిస్తాడు.
ఒక భక్తుడి నిశ్చలతను చూసి శివుడే మెచ్చుకున్నాడు కదా! మరి, అదే శివుని మనసు గెలవడానికి, సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతి ...." శైలపుత్రి " గా మారి ఎంతటి నిశ్చల తపస్సు చేసిందో రేపటి శివలీలామృతం పెద్ద వీడియోలో చూద్దాం.
మరిన్ని కథలకు ఛానల్ ని ఫాలో అవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి