:: మనుషులను మింగేసే మాయా ద్వీపం - బర్ముడా ట్రయాంగిల్ ::
నమస్కారం! 'జీవన స్రవంతి'కి స్వాగతం. అంతుచిక్కని రహస్యాలు, భయంకరమైన అదృశ్యాలు... వీటన్నింటికీ ఒకే ఒక చిరునామా 'బర్ముడా ట్రయాంగిల్'. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి వెళ్లిన విమానాలు, ఓడలు ఏమవుతున్నాయో ఎవరికీ తెలియదు. అవి అసలు ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయా లేక వేరే లోకానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయా?
ఫ్లోరిడా, బెర్ముడా మరియు ప్యూర్టో రికో మధ్య ఉన్న ఈ ముక్కోణపు ప్రాంతంలో గత వంద ఏళ్లలో వందలాది ఓడలు, విమానాలు అసలు జాడే లేకుండా మాయమైపోయాయి. 1945లో 'ఫ్లైట్ 19' అనే ఐదు అమెరికన్ యుద్ధ విమానాలు శిక్షణలో భాగంగా ఇక్కడికి వెళ్లి తిరిగి రాలేదు. వాటిని వెతకడానికి వెళ్లిన రెస్క్యూ విమానం కూడా అదృశ్యమైపోయింది! విచిత్రం ఏమిటంటే, ఈ ప్రాంతంలోకి వెళ్లగానే దిక్సూచీలు (Compasses) పని చేయడం ఆగిపోతాయి, రేడియో సిగ్నల్స్ కట్ అయిపోతాయి.
దీని వెనుక రకరకాల వాదనలు ఉన్నాయి. కొందరు ఇక్కడ సముద్రం అడుగున భారీ 'మీథేన్ గ్యాస్' నిక్షేపాలు ఉన్నాయని, అవి పేలినప్పుడు ఓడలు మునిగిపోతాయని అంటారు. మరికొందరు ఇక్కడ వింతైన అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయని చెబుతారు. కానీ, కొందరు మాత్రం ఇది గ్రహాంతరవాసుల (Aliens) స్థావరం అని, లేదా పురాణాల్లో చెప్పబడిన అట్లాంటిస్ నగరం ఇక్కడే ఉండి ఉండవచ్చని నమ్ముతారు. ఎన్ని పరిశోధనలు చేసినా, మాయమైన ఓడల శకలాలు కూడా దొరకకపోవడం అతిపెద్ద మిస్టరీ.
బర్ముడా ట్రయాంగిల్... ఇది ప్రకృతి వైపరీత్యమా లేక ఏదైనా అతీత శక్తి ప్రభావమా? ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఇది ఒక సవాలుగానే మిగిలిపోయింది. ఈ మాయా లోకం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ప్రపంచ రహస్యాల కోసం 'జీవన స్రవంతి'ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
అన్నట్టు రేపు సోమవారం పెద్ద వీడియోలో వేల యేళ్ళనాటి రాతి మిస్టరీ స్టోన్ హెంజ్ గురించి తెలుసుకుందాం. మీరంతా తప్పక వింటారని ఆశిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి