12, డిసెంబర్ 2025, శుక్రవారం

:: ఒకే ఒక్క అరగంట ::  

( " మనం గెలిచే ప్రతి నిముషం , మనల్ని కోల్పోయే నిముషమే ")

    సాఫ్ట్ వేర్ ఇంజనీయర్ అయిన రవి, రోజు మొత్తం తన ల్యాప్ టాప్. ఆఫీస్ కాల్స్, యింకా - పని ఒత్తిడిలోనే గడుపుతాడు. అతని పక్కనే ఉంటున్న అతని వృద్ధ తల్లిదండ్రులు అతనితో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూంటారు. కాని, రవి " ఒక అరగంటలో వస్తాను " అన్నట్టు, ఇది అర్జంట్ కాల్ అంటూ వారిని నిరాకరిస్తూంటాడు. ఇది ప్రతిరోజూ జరుగుతూంటుంది. 

    ఒక సాయంకాలం, తను అత్యంత ముఖ్యమైన క్లయింట్ కాల్ మాట్లాడడానికి సిద్ధమవుతున్నప్పుడు, తన తండ్రి బలవంతంగా వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. రవి కోపంగా " నాకు ఇంకా అరగంట టైమ్ ఇవ్వు నాన్నా! లైఫ్ సెటిల్ అవ్వాలి కదా! " అని అరుస్తాడు. తండ్రి నిరాశగా వెనుదిరుగుతారు. 

    కాల్ ముగిసిన వెంటనే, రవి గిల్టీగా ఫీలయ్యి, తన తల్లిదండ్రుల గదికి వెళతాడు. అక్కడ తండ్రి మంచంపై నిశ్శబ్దంగా పడుకొని ఉంటారు. డాక్టర్ వచ్చి " ఆయన ఇప్పుడే కన్నుమూశారు. ఆయన మీకు ఏదో చెప్పాలని చివరి అరగంటగా ప్రయత్నించారు " అని చెబుతారు. 

    రవి నిర్ఘాంత పోతాడు తండ్రి తనకోసం వ్రాసిన చివరి లెటర్ ను చదువుతాడు. అందులో, " బాబూ! మాకు కావలసినది ఆస్థిపాస్థులు కాదు. నీ సమయం. నువ్వు బిజీగా ఉన్నావని తెలుసు. అందుకే, ఈ లోకంలో నాకు మిగిలి ఉన్న అరగంట నీతో మాట్లాడాలని ఆశపడ్డాను " అని ఉంటుంది. 

    రవి కన్నీళ్ళతో, తాను ఏ నిముషం కోసం తన తల్లిదండ్రులను దూరంచేశాడొ, ఆ నిముషమే తన జీవితంలో అత్యంత విలువైనదని గ్రహిస్తాడు.

( బాగుంటే లైక్ చెయ్యండి ) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...