:: ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం - ఎక్కడా ఆగని నిప్పు ::
శ్రోతలకు క్రొవ్విడి వెంకట రాజారావు నమస్కారం. జీవనస్రవంతికి స్వాగతం.
ప్రకృతి ఒక అంతుచిక్కని రహస్యం. మనం సైన్సుతో ఎన్నో విషయాలను ఛేదించాం అనుకుంటాం కాని, ప్రకృతి కొన్ని చోట్ల సైన్స్ కు కూడా సవాలు విసురుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే వింత " నీటి ధారల మధ్య వెలుగుతున్న ఒక ఆరిపోని దీపం " గురించి.
విషయంలోకి వెడితే, అమెరికాలోని న్యూయార్క్ నగరానికి సమీపంలో " చెల్బెన్ హామ్ ఫాల్స్ " అనే ఒక జలపాతం ఉంది. సాధారణంగా నీళ్ళు పడితే మంటలు ఆరిపోతాయికదా! కానీ, యిక్కడ విశేషం ఏమిటంటే, ఆ జలపాతం వెనుక ఒక చిన్న గుహలాంటి ప్రదేశంలో ఒక మంట నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.
దీనిని " ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ " అని పిలుస్తారు. వందల యేళ్ళుగా ఈ మంట ఆరిపోకుండా ఎలా వెలుగుతోందన్న విషయమై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు కావించారు. చివరకు వారు భూమి అంతర్భాగం నుండి వెలువడుతున్న సహజ వాయువు ( నాచురల్ గ్యాస్) వల్ల ఈ మంట వెలుగుతోందని గుర్తించారు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే, ఆ వాయువునుంచి వెలువడే వేడి ఈ మంటను వెలిగించేంత ఎక్కువగా లేదు. మరి, ఆ మంట ఎలా నిలబడుతోందన్నది ఇప్పటికీ ఒక రహస్యమే!
పర్యాటకులు అక్కడకు వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు ఆ గాలికి మంట ఆరిపోయినా ఎవరో ఒకరు మరల వెలిగిస్తూనే ఉంటారు. నీరు, నిప్పు ప్రక్కప్రక్కనే ఉంటూ ప్రకృతి వింతను చాటిచెప్పే ఈ ప్రదేశం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంటు రూపంలో తెలియ జేయండి. ఇలాంటి మరిన్ని వింతలకోసం మన " జీవనస్రవంతి " ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి